Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే కరోనా టెస్ట్​.. మనమే చేసుకోవచ్చు: ఐసీఎంఆర్​ కొత్త మార్గదర్శకాలు

Webdunia
గురువారం, 20 మే 2021 (16:48 IST)
కరోనా టెస్టుల కోసం ఆసుపత్రులు/పరీక్షా కేంద్రాల వద్ద వందల మంది క్యూలు.. కానీ, పదుల సంఖ్యలోనే టోకెన్లు. టెస్టు తమ వరకూ రాదేమోనని ఎగబడిపోయే జనం.. టెస్టులకని పోతే మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోననే భయం.. వెరసి ఒక్క టెస్టు చేయించుకోవడానికి ఎన్నెన్ని తిప్పలు పడుతున్నారో జనం.
 
ఆ తిప్పలు పోగొట్టేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇంట్లోనే.. మనకు మనమే టెస్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మహారాష్ట్రలోని మైల్యాబ్ అనే సంస్థ తయారు చేసిన ‘కొవిసెల్ఫ్’ అనే స్వీయ ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ కు అనుమతులను ఇచ్చింది.
 
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు...
* లక్షణాలున్న వారు లేదా కరోనా సోకిన వారిని కలిసిన వారు మాత్రమే టెస్ట్ చేసుకోవాలి.
* టెస్టులను ఇష్టమొచ్చినట్టు చేయొద్దు.
* సంస్థ టెస్ట్ కిట్ లోని యూజర్ మాన్యువల్ లో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్ష చేసుకోవాలి.
* టెస్టులు చేసుకునేవారంతా గూగుల్ ప్లే స్టోర్ నుంచి హోం టెస్టింగ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
* పరీక్షా పద్ధతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ యాప్ లో ఉంటాయి. 
* అంతేగాకుండా పరీక్ష ఫలితాలు (నెగెటివ్/పాజిటివ్) అందులోనే తెలుసుకోవచ్చు.
* టెస్ట్ పూర్తయిన తర్వాత.. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న, టెస్ట్ చేసుకున్న వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ లోనే ఆ టెస్ట్ పేపర్ ను ఒక ఫొటో తీసుకోవాలి.
* టెస్ట్‌లో పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్టు.. ఒకవేళ లక్షణాలుండి నెగెటివ్ వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
* పాజిటివ్ వచ్చి.. లక్షణాలు తక్కువగా ఉన్నవారు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గనిర్దేశాల ప్రకారం ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలి.
* లక్షణాలుండి యాంటీ జెన్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిన వారిని కరోనా అనుమానిత పేషెంట్ గానే భావించాలి. అలాంటి వారు ఇంట్లో ఐసోలేట్ అవ్వాలి.
* యాప్‌లోని యూజర్ వివరాలు ఐసీఎంఆర్ కొవిడ్ 19 టెస్టింగ్ పోర్టల్ లో భద్రంగా దాస్తారు.
* టెస్ట్ అయిపోయిన తర్వాత సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కిట్ ను భద్రంగా పారేయాలి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments