ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా జెండర్ బడ్జెట్ ను జగన్ సర్కార్ సభకు సమర్పించబోతోంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా సీఎంలుగా పని చేస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు జెండర్ బడ్డెజ్ ప్రవేశపెట్ట లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలు చేపడుతున్నారని చెప్పారు.
వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలతో మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం ప్రవేశపెట్టారని చెప్పారు. రాజకీయంగా మహిళలకు సీఎం జగన్ మెరుగైన అవకాశాలు ఇచ్చారని మంత్రి వనిత చెప్పారు.
ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. జెండర్ బేస్డ్ బడ్జెట్ పేరుతో ఎవరి కేటాయింపులు వారికి నేరుగా చేరేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జెండర్ బేస్డ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
ఇందులో పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు జరపనుంది జగన్ ప్రభుత్వం. దీని ఆధారంగానే ప్రతిపాదనలు కూడా స్వీకరించింది. రేపు ఉదయం 9గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి.