Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (22:45 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. భారత్‌లో కూడా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. జూన్ ఒకటో తేదీ ఉదయానికి దేశవ్యాప్తంగా 3758 కేసులు నమోదైవున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ హెచ్చరిక చేసింది. 
 
ప్రస్తుతం వ్యాప్తితో ఉన్న ఎల్‌ఎఫ్ 7, ఎన్.బి. 1.8.1 సబ్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా వర్గీకరించినట్టు పేర్కొంది. పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎన్.బి.1.8.1 వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్లు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య ఏకకాలంలో పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 
 
ఇప్పటికే ఆమోదం పొందిన కోవిడ్ వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ లక్షణాలను, ప్రభావాన్ని తగ్గించడంలో సమర్ధవంతంగా పని చేస్తాయని భావిస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరోవైపు, తాజా గణాంకాల మేరకు అత్యధికంగా కేరళలో 1400 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో 485, ఢిల్లీ 436, గుజరాత్ 320, వెస్ట్ బెంగాల్ 287, కర్నాటక 238 రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్త ఏపీలో 23 క్రియాశీలక కేసులు ఉండగా, తెలంగాణలో 3 కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments