Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (19:46 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన కామాంధులు వీడియో తీసి మళ్లీమళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. కర్నాటక రాష్ట్రంలోని బెళగావి ప్రాంతానికి చెందిన ఓ నిందితుడు ఓ బాలికకు మంచి స్నేహితుడు. ఆరు నెలల క్రితం తన స్నేహితుడు పిలవడంతో బాలిక అతనితో కలిసి ఓ కొండ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఆ 15 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను నిందితులంతా తమతమ ఫోన్లలో చిత్రీకరించారు. 
 
తమ మాట వినకపోతే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతామంటూ బెదిరించి తాజాగా మరోసారి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈసారి కూడా ఈ కిరాతక చర్యను రికార్డు చేసి బెదిరింపులు కొనసాగించారు. దీంతో బాలిక శనివారం పోలీసులను ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, మిగిలిన పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments