Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు.. బ్రెజిల్ వెనక్కి నెట్టి రెండో స్థానానికి భారత్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:16 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో 90వేలకు పైగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అదే తీవ్రత మళ్లీ కనిపించింది. కరోనా మరణాల్లోనూ అదే స్థాయిలో ఉధృతి కనిపిస్తోంది. 
 
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1115 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 43,70,129కి చేరుకుంది. ఇప్పటిదాకా 73,890 మంది మృత్యువాత పడ్డారు. 
 
దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,97,394కు చేరుకుంది. 33,98,845 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. 
 
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో ఇప్పటికే భారత్ రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌ను మూడోస్థానంలోకి నెట్టేసింది. అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. అమెరికా ప్రస్తుతం 65,14,231 కేసులతో టాప్‌లో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments