Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు రాష్ట్రాల్లోనే 'కరోనా' మరణాలు అధికం...

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (12:55 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 21వేలకు పైగా చేరుకున్నాయి. అలాగే మహణాలు కూడా 1273గా ఉన్నాయి. ఈ మరణాల్లో 52 శాతం ఆ రెండు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హ. ముఖ్యంగా, మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులతో పాటు మరణాలు నమోదైన రాష్ట్రంగా నమోదైంది. 
 
ఆ తర్వాత స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. బుధవారం దేశవ్యాప్తంగా 1,273 కొత్త కేసులు నమోదైతే.. అందులో 52 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అలాగే, బుధవారం 39 మంది చనిపోతే అందులో 79 శాతం మరణాలు ఈ రెండు రాష్ట్రాలవే. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 18 మంది చనిపోతే.. గుజరాత్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
కాగా, దేశంలో ఇప్పటిదాకా 21,355 కేసులు నమోదుకాగా, అందులో 48 శాతం మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ మూడు రాష్ట్రాలకు చెందినవి కావడం గమనార్హం. ఇక దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 683కి పెరిగింది. వీటిలో ఒక్క మహారాష్ట్ర నుంచే 269 మరణాలు సంభవించాయి. గుజరాత్‌లో 103 మంది మృతి చెందారు. 
 
దేశంలో కరోనా మరణాల్లో 55 శాతం ఈ రెండు రాష్ట్రాలవే కావడం గమనార్హం. మన దేశంలో కరోనా సోకిన వారిలో ఇప్పటిదాకా 16 శాతం మంది కోలుకున్నారు. ఢిల్లీలో అత్యధికంగా 724 మంది కోలుకోగా తమిళనాడులో 662, రాజస్థాన్‌లో 344, కేరళలో 308 మంది ఈ వైరస్‌ నుంచి బయటపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments