Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 92 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (09:58 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 92 లక్షలు దాటిపయింది. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం గత 24 గంటల్లో 44,376 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,22,217కి చేరింది. ఇక గత 24 గంటల్లో 37,816 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 481 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,34,699 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,42,771 మంది కోలుకున్నారు. 4,44,746 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
   
కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 13,48,41,307 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,59,032 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇకపోతే, తెలంగాణలో గత 24 గంటల్లో 993 కరోనా కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే మయంలో 1,150 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,042కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,53,715 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,441కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,886 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వీరిలో 8,594 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 62 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

Laya: రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాంత్, లయ తో నాగేశ్వరరెడ్డి చిత్రం

Puranala story::మిరాయ్ సక్సెస్ తో పురాణాలపై కల్పిక కథలు క్యూ కడుతున్నాయ్ - స్పెషల్ స్టోరీ

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments