Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కల్లోలం : 14 వేలకు చేరిన కేసులు.. మరణాల్లో పెరుగుదల

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:18 IST)
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,793కు చేరుకోగా, మరణాల సంఖ్య 488కి పెరిగింది. 
 
ఇప్పటివరకు 2014 మంది కోలుకున్నారని, దేశవ్యాప్తంగా 12,289 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అటు రాష్ట్రాల్లో కరోనా ధాటి కొనసాగుతోంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,323గా నమోదైంది. ఇప్పటివరకు అక్కడ 201 మంది మరణించారు.
 
ఇదే అశంపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 991 కొత్త కేసులు నమోదయ్యాయని, 43 మంది ప్రాణాలు విడిచారని వెల్లడించారు.
 
23 రాష్ట్రాల్లోని 45 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని గుర్తుచేశారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక, ఏపీలో కరోనా నివారణ చర్యల గురించి చెబుతూ, విశాఖలో కట్టుదిట్టమైన చర్యలతో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments