చైనా నుంచి ఫిష్ షిప్, సముద్రంలోనే నిలిపేశారు

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (15:32 IST)
చైనా నుంచి ఏమి వస్తున్నా బాబోయ్ అంటున్నారు జనం. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చాలా చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఐతే అవి ఎప్పుడు వచ్చాయన్నది చూసుకుని మరీ కొంటున్నారు ప్రజలు. ఇక అసలు విషయానికి వస్తే... చైనా నుంచి తాజాగా ‘ఫార్చ్యూన్‌ హీరో’ అనే చైనా ఫిష్‌ షిప్‌ శుక్రవారం విశాఖ పోర్టుకు వచ్చింది.
 
ఇందులో 22 మంది షిప్‌ సిబ్బందిలో 17 మంది చైనా, ఐదుగురు మియన్మార్‌కు చెందినవారు కావడంతో ఆ షిప్ సమాచారం రాగానే దాన్ని సముద్రంలోనే దూరంగా ఆపేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో వచ్చినవారిలో ఎవరికైనా కోవిడ్‌-19 వైరస్ వున్నదో లేదో చెక్ చేస్తున్నారు.
 
షిప్‌ను సముద్రంలో ఆపివేయడానికి కారణం ఇదేనంటూ పోర్టు అధికారులు చెప్పారు. ఐతే చైనా నుంచి వచ్చిందని తెలియగానే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నా తెల్లపోరి మొఖమే తిరుగుతుంటది.. అంటూ దీవాన సాంగ్

Shraddha Das: విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ త్రికాల

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

తర్వాతి కథనం
Show comments