Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమలో కలకలం రేపుతున్న కోయంబేడు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 14 మే 2020 (21:01 IST)
పచ్చటి కోనసీమలో చెన్నై కోయంబేడు మార్కెట్ కలకలం రేపుతోంది. దీనికి కారణం కరోనా వైరస్సే. ఈ మార్కెట్‌కు రాకపోకలు సాగించిన అనేక లారీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు, కొనుగోలుదార్లకు ఈ వైరస్ సోకింది. ఇప్పటికే చెన్నై నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదవుతున్న కరోనా కేసులకు కేంద్ర బిందువుగా చెన్నై కోయంబేడు మారింది. 
 
ఈ మార్కెట్‌కు వెళ్లొచ్చిన అనేక మంది ఆంధ్రా వ్యాపారులు, పౌరులు ఈ వైరస్ బారినపడటం ఇపుడు అక్కడ కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ మార్కెట్ కారణంగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దీని ఎఫెక్ట్ జిల్లాలను దాటుకుని తూర్పుగోదావరి జిల్లా కోనసీమను తాకింది. 
 
కోయంబేడు మార్కెట్ కు వెళ్లొచ్చిన పలువురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అమలాపురంలో రెండు పాజిటివ్ కేసులు తేలాయి. బండారులంకలో ఓ వ్యాన్ డ్రైవర్‌కు పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆయన ద్వారా భార్యకు వైరస్ సోకింది.
 
మరోవైపు కొత్తపేట మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏనుగుల మహల్‌కు చెందిన ఇద్దరికి, బోడిపాలెంకు చెందిన మరొక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు ఈ నెల 10న కోయంబేడు నుంచి రావులపాలెం చేరుకున్నారు. 
 
అయితే కరోనా అనుమానం రావడంతో ఇళ్లకు వెళ్లకుండా... కొత్తపేట సమీపంలో ఉన్న ఓ లంకలో తలదాచుకుని, అధికారులకు సమాచారాన్ని అందించారు. అధికారులు వీరికి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో, ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments