ఎపి పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లి గూడెం పెంటపాడుకు చెందిన ఒక యువకుడు చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతనికి కరోనా లక్షణాలు వచ్చాయి. దీంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. అయితే వైద్యులు అతడిని ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఆసుపత్రిలో చేర్పించుకున్నారు.
రెండురోజులు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చి 10వ తేదీ అతడిని డిశ్చార్జ్ చేసేశారు. నెగిటివ్ వస్తేనే కదా డిశ్చార్జ్ చేయాలని యువకుడు వైద్యులను అడిగారు. అయితే వైద్యులు మాత్రం అదంతా మాకు తెలియదు. మా ఉన్నతాధికారుల ఆదేశాలంటూ తనను పంపించేసినట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో చెప్పాడు.
తనకు దగ్గు, జలుబు ఇంకా తగ్గలేదని, చెన్నైలోనే తనను ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ చేయాలని యువకుడు ఎపి ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాడు. సెల్ఫీ వీడియో తీసి వీడియోను తన స్నేహితులకు పంపించాడు. చెన్నైలో కాకున్నా ఎపికి తీసుకువచ్చి తనకు చికిత్స చేయాలని ప్రాథేయపడుతున్నాడు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో ఇదేవిధంగా అందరినీ పంపించేస్తున్నారని, పాజిటివ్ ఉండగానే అందరినీ పంపిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నాడు యువకుడు.