కరోనా వైరస్ సోకితే దగ్గు, తుమ్ము, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని తెలిసిందే. అయితే వీటికి భిన్నంగా పిల్లల్లో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ పిల్లల్లో మొదటిగా ప్రేగులపై, జీర్ణాశయంపై దాడి చేస్తోందని తేలింది. దీనివల్ల విరేచనాలు, జ్వరం వంటివి వెలుగు చూస్తున్నాయి.
శ్వాస ఇబ్బందులు లేకపోయినా, ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. ఫ్రాంటీయర్స్ జనరల్‌లో ప్రచురితమైన పరిశోధనా కథనం ప్రకారం వైరస్ సోకిన తొలినాళ్లలో చిన్నారులు గ్యాస్ట్రో ఇంటెస్టనల్ లక్షణాలతో సతమతమవుతున్నారు. జీర్ణకోశంపై దాడి చేసి ఇబ్బంది కలిగిస్తోంది.
వైరస్ రిసెప్టర్‌లు దాడి చేసే ఊపిరితిత్తుల్లోని కణాలే ప్రేగుల్లో కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. శ్వాస ఇబ్బందులు లేనప్పటికీ చిన్నారులు, నిమోనియా, కరోనా వైరస్ బారిన పడినట్లుగా మేము గుర్తించామని వారు వెల్లడించారు.