Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మూడో దశ అల వచ్చే అవకాశాలు చాలా తక్కువే : ఐసీఎంఆర్ సైంటిస్ట్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:02 IST)
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ... చిన్నారులను ఇప్పుడే స్కూళ్లకు పంపొద్దని సూచించారు.
 
ఒకవేళ దేశంలో మూడో వేవ్ వచ్చినా కూడా ఇంతకుముందులా అంత ప్రభావం ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెర‌వ‌క‌పోవ‌డమే మంచిదని అభిప్రాయపడ్డారు. తప్పని పరిస్థితుల్లో తెరిస్తే మాత్రం ఎక్కువమంది ఉండకుండా రోజుమార్చి రోజు విధానాలు పాటిస్తే మంచిదన్నారు. 
 
తమ సర్వే ప్రకారం మూడింట రెండు వంతుల మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందిన‌ట్లు తేలిందని.. అంతేకాకుండా వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందన్నారు. 
 
చిన్నారుల‌కు కరోనా సోకినా.. వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. అయినా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని.. ప్రజలందరూ జాగ్ర‌త్త‌లు పాటించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments