Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌గ్గిన‌ట్లే త‌గ్గి పెరుగుతున్న క‌రోనా, త‌స్మాత్ జాగ్ర‌త్త‌

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:02 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాలు తగ్గినట్టే తగ్గి, మ‌ళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా 42,766 మందికి కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా వెయ్యికి దిగువనే నమోదవుతోన్న మరణాలు నిన్న భారీగా పెరిగాయి. తాజాగా 1,206 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,07,95,716కి చేరగా, 4,07,145 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. నిన్న 19,55,225 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.
 
ఇక 24 గంటల వ్యవధిలో 45,254 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.99 కోట్లకు చేరగా.. ఆ రేటు 97.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,55,033 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.48 శాతానికి తగ్గింది. మరోపక్క నిన్న 30,55,802 మంది టీకాలు తీసుకున్నారు.

ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 37కోట్ల మార్కును దాటింది. అయినా మ‌ళ్ళీ క‌రోనా పెరిగే అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగానే ఉండాల‌ని వైద్య ఆరోగ్య శాఖ కోరుతోంది. క‌రోనా నియ‌మాల‌ను పాటించాల‌ని వైద్య‌నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments