Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలవర పెడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు

Advertiesment
కలవర పెడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు
, గురువారం, 24 జూన్ 2021 (12:32 IST)
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా కేసులు వెలుగు చూశాయి.

అత్యధికంగా..మహారాష్ట్రలోనే 21 కేసులు వెలుగు చూడడం గమనార్హం. తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ లో ఆరు, కేరళలో మూడు, తమిళనాడులో తమిళనాడులో మూడు కేసులు బయటపడ్డాయి. ఇక పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా ప్లస్‌ రకాన్ని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రకటించింది.

దీనిలో సంక్రమణశక్తి పెరగడం, ఊపరితిత్తులపై ప్రభావం చూపిస్తుండడం, మోనాక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 కన్సార్షియం ఆన్‌ జీనోమిక్స్‌… ఇన్సాకాగ్‌ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో డెల్టా ప్లస్ రకం కేసులున్నాయి. దాదాపు 10 దేశాల్లో ఇలాంటి కేసులున్నాయని అంచనా. ప్రస్తుతం ఇలాంటి కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అజాగ్రత్తలు వద్దని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థర్డ్ వేవ్ ఊహాగానాలు - చిన్న పిల్లలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు