Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాము విషంతో క‌రోనాకు చెక్ ... శాస్త్రవేత్తల ఆవిష్కరణ

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (18:23 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క శాస్త్రవేత్త లేదా దేశం సరైన మందును కనిపెట్టలేకపోయింది. అందుకే ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా వ్యాక్సిన్లను పలు దేశాలు అభివృద్ధి చేశాయి. 
 
ఈ నేపథ్యంలో బ్రెజిల్ అడ‌వుల్లో క‌నిపించే స‌ర్పం జ‌రారాకుసోకు చెందిన విషంతో కోవిడ్‌19ను అంతం చేయ‌వ‌చ్చు అని శాస్త్ర‌వేత్త‌లు గట్టిగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్య‌య‌న నివేదిక‌ను సైంటిఫిక్ జ‌ర్న‌ల్ మాలిక్యూల్స్‌లో ప్ర‌చురించారు. 
 
ర‌క్త‌పింజ‌ర జ‌రారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆ స‌ర్ప విష అణువులు కోతుల్లో 75 శాతం క‌రోనా వైర‌స్ క‌ణాల వృద్ధిని నియంత్రిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. 
 
ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాణాంత‌కంగా మారుతున్న కోవిడ్ వ్యాధి నివార‌ణ‌లో వైప‌ర్ స్నేక్ జ‌రారాకుసో విషంలో ఉన్న అణువులు కీల‌కం కానున్న‌ట్లు భావిస్తున్నారు. సావో పౌలో యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ రాఫేల్ గైడో దీనికి సంబంధించిన వివ‌ర‌ణ ఇచ్చారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments