Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాలకూరలో పాము.. షాకైన దంపతులు.. బుస్ బుస్ మంటూ..?

Advertiesment
పాలకూరలో పాము.. షాకైన దంపతులు.. బుస్ బుస్ మంటూ..?
, శనివారం, 17 ఏప్రియల్ 2021 (17:10 IST)
snake
సూపర్ మార్కెట్‌లో పాలకూర తెచ్చుకున్న ఆ జంటకు షాక్ తప్పలేదు. పాలకూరలో పాము వుండటం చూసి ఆ జంట భయాందోళనలకు గురైంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసించే భార్యాభర్తలిద్దరూ సరుకులు, కూరగాయాలు తెచ్చుకోవటానికి సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. ఇంటికి కావాల్సిన కూరగాయలు కొన్నారు. ఇంటికొచ్చాశారు. తెచ్చి కూరల్ని సర్ధుదామని తీసారు..ఒక్కొక్కటి సర్దడం మొదలుపెట్టారు. 
 
ఇంతవరకూ బాగానే ఉంది. వాళ్లు మార్కెట్ నుంచి తెచ్చని పాలకూర కట్టలు పెట్టిన కవర్ లోంచి బుస్ బుస్ మంటూ ఓ పాము బైటకొచ్చింది. దాన్ని చూసి ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ పాలకూర ప్యాకెట్ లో 7.8 అంగుళాల పాము బైటకొచ్చింది. దాన్ని చూసిన వారు భయపడ్డారు. 
 
అలెక్స్ వైట్ అనే వ్యక్తి తన భార్య అమేలియా నీట్‌తో కలిసి కొనుగోలు చేసిన పాలకూర ప్యాకెట్‌లో అరుదైన విషసర్పం ఒకటి కనిపించటంతో అతను వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అదికాస్తా వైరల్ అయ్యింది. 
 
తాను మార్కెట్‌లో పాలకూర కట్ట తీస్తున్నప్పుడు ఏదో బరువుగా అనిపించిందనీ..లోపల ఏదైనా ఉందా? ఏంటీ అని సరదాగా తనలో తానే అనుకున్నాననీ కానీ అదే నిజమైందని తెలిపాడు అలెక్స్. ఇది నిజంగా చాలా చాలా షాకింగ్ గా అనిపించిందనీ.. పొరపాటున ప్యాకెట్ మొత్తం విప్పేస్తే ఏమయ్యేదో.. ఆ విషసర్పం కాటుకు బలయ్యేవాళ్లమేమోనని తెలిపాడు.
 
పాలకూరలో పాము ఉన్న విషయాన్ని అలెక్స్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు వెంటనే వచ్చి ఆ పామును పట్టుకుని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ యూజర్లకు సైబర్ వార్నింగ్.. ప్రైవసీ పాలసీని యాక్టివ్ చేయకపోతే..?