Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ ధరించిన ఉంగరం కథేంటి? ఇదే హాట్ టాపిక్..?!

Advertiesment
పవన్ ధరించిన ఉంగరం కథేంటి? ఇదే హాట్ టాపిక్..?!
, సోమవారం, 5 ఏప్రియల్ 2021 (20:03 IST)
Snake Ring
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొడిగిన ఉంగరం ప్రస్తుతం ఫిలిమ్‌ నగర్‌లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా పవర్ స్టార్ ఎప్పుడూ చాలా సింపుల్‌గా వుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో కాస్త వెరైటీగా కనిపించారు. ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల దృష్టి పవన్ చేతుల మీద పడేలా చేసింది. చేతికున్న ఉంగరం అందరిని ఆకర్షించింది. ఆ ఉంగరంపై ఇటు టాలీవుడ్‌తో పాటు అటు రాజకీయంగా హాట్‌ టాపిక్ మారింది.
 
పవన్ ధరించిన ఉంగరం నాగఅంగుళీకం పవన్ అది ఎందుకు ధరించారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కొన్నాళ్లుగా రాజకీయాలు పవన్‌కు కలిసి రావడం లేదు ఇది పెట్టుకుంటే ఫ్యూచర్ బావుంటుందని ఎవరైనా సలహా ఇచ్చారా..? లేదంటే ఆధ్యాత్మికంగా దేవున్ని బాగా నమ్మే పవన్‌ ఈ నాగ అంగుళీకాన్ని పెట్టుకున్నారా..? అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే చాలా సింపుల్‌గా ఉండే పవన్ ఈ ఉంగరాలు ధరించడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు.
 
మరోవైపు ఈ నాగ అంగుళీకాన్నిఎప్పుడూ పడితే అప్పుడు ధరించరని తెలుస్తోంది. ఫ్యాషన్ కోసం అయితే అసలు ధరించరు ఒకవైపు తిరుపతి బై ఎలక్షన్స్ అంతుకుముందు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ఉండడంతోనే బాగా కలిసి వస్తోందని ఉంగరం ధరించినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరోమారు "ఆచార్య" మూవీ రిలీజ్ వాయిదా?