Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ బయోటెక్ ట్రయల్స్ సస్పెండ్ చేసిన బ్రెజిల్

Webdunia
శనివారం, 24 జులై 2021 (15:08 IST)
హైదరాబాద్ ఆధారిత భారత్‌ బయోటెక్‌ సంస్థ బ్రెజిల్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో వ్యాక్సిన్‌ డోసుల సరఫరా కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కోవాగ్జిన్ సప్లై కోసం జరిగిన 324 మిలియన్ డాలర్ల ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో డీల్ నుంచి భారత్ బయోటెక్ తప్పుకుంది. దీంతో బ్రెజిల్‌కు సప్లై చేయాల్సిన 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ సరఫరాకు బ్రేక్ పడింది.
 
గత నవంబర్‌ 20న బ్రెజిల్‌కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్‌, ఎన్విక్సియా ఫార్మాతో భారత్ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసుకు 15 డాలర్లు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. 
 
అయితే, ఈ ఒప్పందంలో బ్రెజిల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తగా.. మొదట బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి రికార్డో మిరందా చేసిన వ్యాఖ్యలతో ఈ అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి సందేహాస్పదమైన ఇన్‌వాయిస్‌ను క్లియర్ చేయాల్సిందిగా తనపై పైనుంచి ఒత్తిడి తీసుకొచ్చారని మిరందా ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments