ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. టీకాల కొరతకు చెక్ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇస్తోంది భారత్. ఇక, వేటి సామర్థ్యం ఎంత? అవి.. డెల్టా వేరియంట్లపై ప్రభావం చూపుతాయా? అనే చర్చ సాగుతోంది.
ఈ తరుణంలో.. కోవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలను విడుదల చేసింది భారత్ బయోటెక్. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8 శాతం సామర్థ్యాన్ని చూపినట్టు పేర్కొంది.
ఇక, తీవ్రమైన కేసులపై 93.4 శాతం ప్రభావాన్ని చూపుతోందని.. అంతేకాదు.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న బీ.1.617.2 (డెల్టా), బీ.1.351 (బీటా) వేరియంట్లపై 65.2 శాతం ప్రభావాన్ని ప్రదర్శిస్తోందని.. కోవిడ్ తీవ్ర లక్షణాలను నిలువరించి ఆస్పత్రిలో చేరే పరిస్థితులను తగ్గిస్తోంది.
కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను ప్రచురించిన భారత్ బయోటెక్ మెడ్‌జివ్ పేర్కొంది. భారత్‌లో జరిగిన అతిపెద్ద ట్రయల్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ సురక్షితమైందని తేలినట్టు చెబుతోంది భారత్ బయోటెక్.