ప్రముఖ కమేడియన్, టీవీ ప్రోగ్రామ్‌లు హోస్ట్‌గా వుంటున్న అలీ గురించి తెలియంది కాదు. ఆయన ఒకపక్క టీవీలో బిజీగా వున్నా సినిమాలు కూడా చేస్తున్నాడు. పలు సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన ఆయన తాజాగా నిర్మాతగానూ మారాడు. తన స్నేహితుడినే దర్శకుడిగా పరిచయం చేస్తూ `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి` అనే సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే కరోనా వల్ల చాలా మంది టీవీ, సినిమా కార్మికులు ఇబ్బందిపడుతుండగా కొందరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అంతకుమించి చేయాలని కరోనా వేక్సిన్ వేయాలని నిర్ణయించుకున్నారు. కోవేక్సిన్ వేయడానికి సిద్ధపడి కార్మికులలో ఇంకా ఎవరైనా టీకాలు వేయించుకోకపోతే వేస్తానని తెలియజేశారు. అందుకు అన్నపూర్ణ ఏడెకాల వద్ద డ్రైవర్స్ యూనియన్ కార్యాలయం వద్ద బుధవారంనాడు టీకాలకు శ్రీకారం చుట్టారు. ఆరోజు వచ్చిన పరిమిత సభ్యులతో టీకా వేయిస్తుండగా షడెన్‌గా ఆయనకు బ్రేక్ పడింది. ఇలా వేక్సిన్ వేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి కావాలంటూ కొందరు ఆయన్ను అడ్డుకోవడంతో వాయిదా వేశారు. గురువారంనాడు ఈ విషయమై ఆయన ఓ వాయిస్‌ను ఆయా శాఖల వారికి తెలియజేశారు. మరలా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పుడు తెలియజేస్తానంటూ పేర్కొన్నారు.
వేక్సిన్‌కు అనుమతి ఏమిటి? అనేది తనకు తెలియదని అందరూ చేస్తుంటే సేవ దృక్పతంతో ఉచితంగా తాను చేస్తున్నాననీ, కోవేక్సిన్ ఇచ్చిన డాక్టర్లుకూడా తెలీని పర్మిషణా అనేది, ఏమిటీ వింత అంటూ సన్నిహితుల వద్ద వాపోయారు. అలీ ఆమధ్య వై.ఎస్. జగన్ పార్టీ తీర్థం కూడా తీసుకున్నారు. అప్పట్లో ఆయనకు సినిమారంగానికి చెందిన పదివికూడా రానున్నదని ప్రచారం జరిగింది. దాన్ని ఆ తర్వాత అలీ ఖండించారు.