Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కోవిడ్ వైరస్.. రోజుకు 2వేల మంది మృతి

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (11:06 IST)
బ్రెజిల్‌లో కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో రోజూ 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అలాగే కరోనా మృతుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది బ్రెజిల్. ఇప్పటివరకూ ఈ దేశంలో 2,68,370 మంది చనిపోయారు. బుధవారం ఒక్క రోజే 2,286 మంది కన్నుమూశారు. 
 
పీ1 అని పేరు పెట్టిన కొత్త కరోనావైరస్ రకం వ్యాప్తి వల్ల దేశంలో కేసుల సంఖ్య మళ్లీ విపరీతంగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఈ కరోనావైరస్ రకం.. మానాస్ అనే అమెజాన్ నగరంలో పుట్టినట్లు భావిస్తున్నారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరగటంతో బ్రెజిల్‌లోని పెద్ద నగరాల్లో ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. చాలా ఆస్పత్రులు కుప్పకూలే పరిస్థితికి చేరుకున్నాయని దేశంలో ప్రధాన ప్రజారోగ్య కేంద్రం ఫియోక్రజ్ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments