Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆస్పత్రి ఫుల్.. పడకల్లేవ్.. ఇక్కడకు రావొద్దు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:41 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో అనేక ఆస్పత్రుల్లో పడకలన్నీ ఫుల్ అయ్యాయి. ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఫలితంగా రెండో దశ కరోనా వైరస్ దెబ్బకు దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
మరోవైపు, క‌రోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండ‌టంతో ఆసుప‌త్రుల‌న్నీ రోగుల‌తో నిండిపోతున్నాయి. ఒక‌వైపు బెడ్స్ లేక, మ‌రోవైపు ఆక్సిజ‌న్ కొర‌త నేప‌థ్యంలో కొత్త రోగుల‌ను చేర్చుకునేందుకు ఆసుప‌త్రులు చేతులెస్తున్నాయి. 
 
మ‌ధ్య‌ప్ర‌దేశ్ సెహోర్ జిల్లా ఆసుపత్రిలో పడకలు రోగుల‌తో నిండి పోయాయి. దీంతో ఇక ఎవ‌ర్నీ అడ్మిట్ చేసుకోలేమంటూ ఆసుప‌త్రి గేట్‌కు నోటీసులు అంటించారు.
 
జిల్లా ఆసుప‌త్రిలోని అన్ని ప‌డ‌క‌లు బుధ‌వారం రాత్రితో నిండిపోయాయ‌ని సివిల్ స‌ర్జ‌న్ తెలిపారు. దీంతో రోగులను అడ్మిట్ చేసుకోలేమ‌ని చెప్పారు. దీనికి తోటు ఆక్సిజ‌న్ సిలెండ‌ర్ల‌ స‌ర‌ఫ‌రా గ‌తం క‌న్నాత‌క్కువ‌గా ఉన్న‌ద‌ని అన్నారు. 
 
ఇలాంటి ప‌రిస్థితుల్లో జిల్లా ప్ర‌జ‌లు ఆసుప‌త్రికి రావ‌ద్ద‌ని, ఇంటి వ‌ద్ద‌నే ఉండాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు. దేశంలోని చాలా ఆసుప‌త్రుల్లో ఇలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments