కరోనా భయం గుప్పెట్లో భారత్.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:47 IST)
దేశంలో కరోనా భయం నెలకొంది. ప్రతి రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతులసంఖ్య కూడా అధికంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నేరుగా రంగంలోకి దిగింది. 
 
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప‌లు హైకోర్టుల్లో జ‌రుగుతున్న విచార‌ణ‌ల‌ను సుమోటోగా స్వీక‌రించింది. అస‌లు ఆక్సిజ‌న్‌, ఇత‌ర కొవిడ్ సంబంధిత ఔష‌ధాలు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై జాతీయ ప్ర‌ణాళిక ఉందా అంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 
 
ప్ర‌స్తుతం నేష‌న‌ల్ ఎమ‌ర్జెర్సీలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని సుప్రీం వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కొవిడ్ సంసిద్ధ‌తోపాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.
 
గురువారం చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం దీనిపై విచార‌ణ జ‌రిపింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, క‌ల‌క‌త్తా, అల‌హాబాద్ హైకోర్టులు ప్ర‌స్తుతం కొవిడ్ సంసిద్ధ‌త‌కు సంబంధించిన అంశాల‌పై విచార‌ణ జ‌రుపుతున్నాయి. 
 
ఇవి ప్ర‌జ‌ల‌ను మ‌రింత అయోమ‌యానికి గురి చేస్తున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతానికి ఆయా కోర్టులు విచార‌ణ‌లు కొన‌సాగించుకోవ‌చ్చ‌ని చెప్పిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. కొన్ని అంశాల‌ను మాత్రం త‌మ ప‌రిధిలోకి తీసుకుంటామ‌ని చెప్పింది. ఈ మొత్తం అంశంపై త‌మ‌కు ఓ జాతీయ ప్ర‌ణాళిక కావాలి అని సీజేఐ బోబ్డే తేల్చి చెప్పారు. 
 
ఇక నాలుగు అంశాల‌పై స‌మాధానాలు అడిగింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, అత్య‌వ‌స‌ర మందుల స‌ర‌ఫ‌రా, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న తీరుతోపాటు లాక్డౌన్‌లు విధించుకునే అధికారం రాష్ట్రాల‌కు వ‌దిలేయాల‌న్న అంశాల‌పై సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాల‌ను కోరింది. 
 
అయితే, లాక్డౌన్‌పై నిర్ణ‌యం తీసుకునే అధికారం న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు లేద‌ని స్పష్టం చేసింది. రేప‌టి నుంచి క‌రోనా నియంత్ర‌ణపై విచార‌ణ జ‌ర‌పనున్న‌ట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments