Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:01 IST)
కరోనా వైరస్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్య నిపుణులతో ఈ రోజు చంద్రబాబు వీడియో కాన్పెరెన్స్ నిర్వహించారు. ఇందులో చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
 
కరోనా బాధితులకు ఆస్పత్రిలో కనీసం పడకలు లేని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఇక వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణించి పోయిందని తెలిపారు.
 
కరోనా వలన ఆర్థికంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఇక ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకు పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కొత్తగా 10,392 కేసులు నమోదు కాగా మొత్తం 60,804 శాంపిల్స్‌ను పరీక్షించారు.
 
ఇక మరో 8,454 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో కొత్తగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 4,55,531 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,30,076 యాక్టివ్ కేసులున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments