విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల వ్యవధిలో 76 మంది మృతి

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:32 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వరుసగా తొమ్మిదో రోజూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 59,919 నమూనాలను పరీక్షించగా 10,776 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 76 మంది కరోనాతో మృతిచెందారు.
 
ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 9 మంది, ప్రకాశం 9, గుంటూరు 8, కడప 8, నెల్లూరు 8, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కర్నూలు 2, విజయనగరంలో ఇద్దరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. 
 
ఒక్కరోజులో 12,334 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,65,694 నమూనాలను పరీక్షించారు. తాజా లెక్కలతో కలిపి 1,02,067 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments