Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. చైనాలో తగ్గుతుంటే.. భారత్‌లో పెరుగుతున్నాయ్... (Video)

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (17:35 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇపుడు భారత్‌లో విజృంభిస్తోంది. ముఖ్యంగా, ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న చైనాలోని వూహాన్ నగరంలో ప్రస్తుతం పరిస్థితి కుదుటపడుతోంది. అలాగే, చైనాలో కూడా నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగా ఉంది. కానీ, భారత్‌లో మాత్రం ఈ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారంతో భారత్‌లో మొత్తం 31 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో ముగ్గురు కేరళ వాసులు మాత్రం చికిత్స పూర్తిచేసుకుని సురక్షితంగా ఇంటికి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రకటించారు. 
 
అలాగే, భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు తెలంగాణాలో నమోదైంది. ఆ తర్వాత ఢిల్లీ రెండు కేసులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడు, రాజస్థాన్ రాష్ట్రంలో 17, కేరళలో మూడు కేసులు చొప్పున నమోదు కాగా, శుక్రవారం ఢిల్లీలో మరో కేసు నమోదైంది. దీంతో ఢిల్లీలో మొత్తం 3 కేసులు నమోదైనట్టయింది. 
 
కాగా, ప్రపంచ వ్యాప్తంగా 94,900 మందికి ఈ వైరస్ సోకగా, 3,272 మంది మృతి చెందారు. చైనాను మినహాయిస్తే 79 విదేశాల్లో 14,500 కేసులు నమోదు కాదు, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాల్లో రికార్డు స్థాయిలో 272 కేసులు నమోదయ్యాయి.

ఒక్క చైనాలోనే 80,400 మందికి ఈ వైరస్ సోకగా, మూడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 కారణంగా హుబెయ్ ప్రొవిన్స్‌లో డిసెంబరు నెలలో తొలి మరణం సంభవించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments