Webdunia - Bharat's app for daily news and videos

Install App

2న కరోనా టీకా డ్రై రన్‌ : ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే...

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (17:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేశాయి. వీటిలో కొన్నింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ టీకాలను అత్యవసర వినియోగం కింద భారత్‌లో కూడా పంపిణీ చేయనున్నారు. 
 
ఇందులోభాగంగా, వ్యాక్సిన్ పంపిణీ కోసం ముందస్తు ఏర్పాట్లకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా శనివారం డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షతన గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు డ్రై రన్‌ విధివిధానాలపై చర్చించారు.
 
ప్రతి రాష్ట్రంలోని రాజధానిలో కనిష్ఠంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో డ్రై రన్‌ నిర్వహిస్తారు. వైరస్‌ తీవ్రత ఎక్కువ, రవాణా సౌకర్యం తక్కువగా ఉన్న పలు జిల్లాల్లోనూ డ్రైరన్‌ నిర్వహించనున్నారు. 
 
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రాజధానుల్లోకాకుండా ఇతర ప్రధాన నగరాల్లో డ్రై రన్ నిర్వహించే అవకాశం ఉంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే గత నెల 28, 29న తొలి విడుత డ్రై రన్‌ కొనసాగిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం