Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేటలో ఒకే ఫ్యామిలీలో 22 మందికి కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (17:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. 
 
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతి చెందగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌లో నివాసం ఉండే మృతుడి బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఓ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తగా పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలిందని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. బాధితుల్లో లక్షణాలేవీ కనిపించకపోయినా పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం యాదాద్రి టౌన్‌ షిప్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటిని సర్వే చేస్తున్నారు. బాధితులంతా హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఈ 22 మందితో కాంటాక్టుయిన మరో ఆరుగురికి సైతం పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments