Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న స్ట్రెయిన్ కేసులు : వణుకుతున్న భారతం

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (16:54 IST)
దేశంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడిపోయిన ప్రజలు.. ఇపుడు కొత్తగా కరోనా స్ట్రెయిన్ రూపంలో సరికొత్త భయం పట్టుకుంది. పైగా, ఈ వైరస్ దేశంలో క్రమంగా ప్రభావం చూపుతోంది. 
 
తాజాగా దేశంలో కొత్తగా మరో నాలుగు స్ట్రెయిన్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. భారత్‌లో మొత్తం స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి చేరింది. గడచిన మూడు రోజుల వ్యవధిలో 25 మందికి స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. 
 
మొత్తం స్ట్రెయిన్ కేసుల్లో న్యూఢిల్లీలో 10, పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌ఐబీఎంజీ కల్యాణిలో 1, పుణెలో 5, హైదరాబాద్‌లో మూడు, బెంగళూరులో 10 కేసులు నమోదయినట్లు కేంద్రం ప్రకటించింది. యూకేలో కలకలం రేపుతున్న ఈ స్ట్రెయిన్ వైరస్ పలు ప్రపంచ దేశాల్లో ప్రభావం చూపుతోంది.
 
ఇకపోతే, యూకేతో పాటు భారత్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాల్లో స్ట్రెయిన్ కేసులు నమోదవడం గమనార్హం. 
 
స్ట్రెయిన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యూకే నుంచి ప్రయాణాలపై భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలు నిషేధం విధించాయి. యూకేలో సెప్టెంబర్ 21న కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ తొలి కేసు వెలుగుచూసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments