Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కొత్త కేసులు 55 వేలు.. మృతులు 702

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (10:59 IST)
దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 55 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అలాగే 702 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 55,838 మందికి కరోనా నిర్ధారణ అయిందని పేర్కొంది. అదేసమయంలో 79,415 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,06,946 కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 702 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,16,616 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 68,74,518 మంది కోలుకున్నారు. 7,15,812 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో బుధవారం మొత్తం 9,86,70,363 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. బుధవారం ఒక్కరోజులోనే 14,69,984 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,456 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,292 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,06,105 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,292 కి చేరింది. ప్రస్తుతం 20,183 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 16,977 మంది హోంక్వారంటైనులో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 254 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 98 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments