కేరళను వణికిస్తున్న నిఫా - మరో ఇద్దరు హెల్త్ వర్కర్లలో లక్షణాలు

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (16:49 IST)
నిఫా వైరస్ కేరళ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ ఆదివారం వెల్లడించారు. మరణించిన 12 ఏళ్ల బాలుడికి దగ్గరగా ఉన్న 20 మంది హైరిస్ట్‌ కాంటాక్టుల్లో ఇద్దరూ ఉన్నారని తెలిపారు. 
 
ఈ అంశంపై ఆమె స్పందిస్తూ, 'మేమం ఇప్పటివరకు 188 కాంటాక్ట్‌లను గుర్తించాం. నిఘా బృందం వారిలో 20 మందిని హై రిస్క్‌ కాంటాక్టులుగా గుర్తించింది. ఇద్దరిలో లక్షణాలున్నాయి. వీరిద్దరూ ఆరోగ్య కార్యకర్తలు. ఒకరు ప్రైవేటు హాస్పిటల్‌లో పని చేస్తున్నారు. మరొకరు కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌ మెంబర్‌' అని వివరించారు. 
 
నిఫా వైరస్‌ పరిస్థితిపై ఆమె ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం వరకు 20 హై రిస్క్‌ కాంటాక్టులను కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీకి బదిలీ చేయనున్నట్లు చెప్పారు. పిల్లలు, ఇతర కాంటాక్టులు క్వారంటైన్‌లో ఉండాలని కోరినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments