Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ 19: ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వినాయక చవితి ఊరేగింపులు వద్దు

కోవిడ్ 19: ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వినాయక చవితి ఊరేగింపులు వద్దు
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:53 IST)
పండుగల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో ఏపీలో ఎలాంటి సడలింపు లేకుండా కరోనా నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు.
 
వినాయక చవితి సందర్భంగా ఊరేగింపులను నివారించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. పండుగను వారివారి ఇళ్లలో పాటించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే పెళ్లిళ్లు, బహిరంగ సభలు నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపారు.
 
అన్ని విద్యా సంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్‌లు పాటించేలా చూడాలని జగన్ అధికారులను కోరారు. టీకా విషయానికొస్తే, వైరస్‌ బారిన పడిన వారిపై కోవిడ్ అనంతర ప్రభావాలను మరియు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకిన వ్యక్తులపై వాటి ప్రభావాలను అధ్యయనం చేయాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jagananna Vidya Deevena డబ్బు తల్లుల ఖాతాల్లో కాదు కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లోకి...