Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు - మొత్తం కేసులు 20

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (10:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 12 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు ఉండటం గమనార్హం. ఈ 12 మందితో కలుపుకుంటే తెలంగాణాలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20కి చేరింది. 
 
ఇదిలావుంటే, కెన్యా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడికి ఒమిక్రాన్ వైరస్ సోకింది. అయితే, ఆయన అధికారుల కన్నుగప్పి అదృశ్యమయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ముమ్మరంగా గాలించి, అపోలో ఆస్పత్రిలోని అతిథి గృహంలో ఉన్న ఆ రోగిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గత 2020 మార్చి నుంచి ఇప్పటివరకు ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,081 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి 7,469 మంది కోలుకున్నారు. అదేసమయంలో 264 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 83,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకు 3,41,78,940 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 4,77,422 మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

రోషన్ కనకాల మోగ్లీ 2025 చిత్రంలో సాక్షి సాగర్‌ మదోల్కర్‌ పరిచయం

బ్రహ్మానందం పాతపడిపోయాడు అందుకే కామెడీ రావడంలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments