Publish Date: Sun, 19 Dec 2021 (10:27 IST)
Updated Date: Sun, 19 Dec 2021 (10:35 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గత 2020 మార్చి నుంచి ఇప్పటివరకు ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,081 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అలాగే, ఈ వైరస్ నుంచి 7,469 మంది కోలుకున్నారు. అదేసమయంలో 264 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 83,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకు 3,41,78,940 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 4,77,422 మంది చనిపోయారు.