Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ శివార్లలో భారీగా కేసులు.. వందమంది పైగా పాజిటివ్, లాక్డౌన్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:49 IST)
తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ శివార్లలో సైతం కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీలో కరోనా కలకలం రేపింది. గొల్లపల్లిలో ఏకంగా వంద మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఇటీవల వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతు సదస్సులో వీరంతా పాల్గొనడం ద్వారా వీరికి కోవిడ్ సోకిందని స్థానికులు అంటున్నారు. 
 
గొల్లపల్లి గ్రామంలో పరీక్షలు నిర్వహించగా వంద మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మరోవైపు గొల్లపల్లితో పాటు శంషాబాద్‌లోని వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఇప్పటికే చిన్న గోల్కొండ ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. పాలమాకుల పాఠశాలలోనూ ఇరవై మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. అయితే వంద మందికి కరోనా కేసులు నమోదు కావడంతో.. గొల్లపల్లి గ్రామస్థులు స్వచ్ఛంధంగా లాక్‌డౌన్ విధించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments