Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రొట్టెలు మృదువుగా వుండాలంటే?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:57 IST)
గృహిణులు వంటింట్లో అడుగు పెట్టి రుచికరమైన వంటకాన్ని తయారుచేసేందుకు తిప్పలు పడుతుంటారు. కొన్నిసార్లు అనుకున్నదానికంటే ఎక్కువ పాళ్లలో దినుసులు వేయడమో, లేదంటే కారం ఎక్కువగా వేయడమో చేసి పదార్థం రుచి దెబ్బతింటుందని బాధపడుతుంటారు. కొన్ని సమయాల్లో కొన్నింటిని ఇలా అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
పసుపు ఎక్కువైతే
కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే, అది ఎక్కువగా ఉన్న పసుపును పీల్చేసుకుంటుంది.
 
గోధుమ రొట్టెలు
గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా వస్తుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. 
 
పన్నీరు కలపాలి
గులాబ్ జామూన్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు, ఆ పిండిలో కాస్తంత పన్నీరు కలపాలి. ఇలా చేయడం వల్ల జామూన్‌లు నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి.
 
ఇడ్లీలు మృదువుగా
ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే... ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి.
 
కాకరకాయ కూర
కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయాలి. అలా చేస్తే చేదు తగ్గడమే కాకుండా, కూరకు కొత్త రుచి వస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments