Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపప్పు వేసి కోడికూర చేస్తే... ఎలా వుంటుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:26 IST)
నాన్ వెజ్ ఐటెమ్స్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఐతే చికెన్ అంటే మరీ ఇష్టంగా తింటుంటారు. జీడిపప్పు, మసాలా వేసి తగినవిధంగా దినుసులతో కోడికూర చేస్తే ఆ టేస్టే వేరు. ఎలా చేయాలో చూద్దాం రండి.
 
కావలసిన పదార్ధాలు : 
కోడి మాంసం- ఒక కిలో
లవంగాలు- ఆరు
కారం- రెండు స్పూనులు
ఉప్పు- సరిపడా
పసుపు- కొంచెం
గసగసాలు- 50 గ్రాములు
నూనె- 100 గ్రాములు
పచ్చిమిర్చి- ఎనిమిది
ఉల్లిపాయలు- నాలుగు
నిమ్మకాయ- ఒకటి
అల్లం- 50 గ్రాములు
పెరుగు- పావు లీటరు
వెల్లుల్లిపాయలు- రెండు
దాల్చిన చెక్క- ఆరు
ధనియాలు- ఆరు స్పూన్లు
యాలకులు- ఎనిమిది
జీడిపప్పు- 50 గ్రాములు
కొత్తిమీర- ఒక కట్ట
 
తయారీ విధానం :
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా ముద్దగా నూరుకోవాలి. గసగసాలు, ధనియాలు, దాల్చిన  చెక్క, లవంగాలు వేడి చేసుకుని వాటిని కూడా మెత్తగా నూరి ఉంచుకోవాలి. మాంసాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకోవాలి. అందులో అల్లం ముద్ద, ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత యాలకులు, జీడిపప్పు వేసి దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసి అందులోనే వేపుకోవాలి. 
 
బాగా ఉల్లిపాయలు వేగాక మాంసం అందులో వేసి దానికి కొంచెం పసుపు, కారం బాగా పట్టించి మూత పెట్టాలి. మాంసంలోని నీరంతా ఇంకి పోయిన తరువాత అర్ధ శేరు నీళ్ళు పోసి ఉడికించాలి. మాంసం ఉడికిన తరువాత మసాలా ముద్దను పెరుగులో కలిపి అందులో వేసి, బాగా కలిపి, కొంచెం సేపు ఉడికిన తరువాత దించేయాలి. అంతే కోడికూర రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments