మీల్‌మేకర్ మంచూరియా తయారీ విధానం....

మీల్‌మేకర్‌లోని హై ప్రోటీన్స్ మహిళల, పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిదని పరిశోధనలో వెళ్లడైంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుటకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, ఐరన్ పుష

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (11:19 IST)
మీల్‌మేకర్‌లోని హై ప్రోటీన్స్ మహిళల, పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిదని పరిశోధనలో వెళ్లడైంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుటకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. అలాంటి మీల్‌మేకర్‌తో మంచూరియా తయారుచేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
మీల్‌మేకర్ - 200 గ్రాములు
కొత్తిమీర - 3 కట్టలు
సోయాసాస్ - 6 స్పూన్స్
ఉల్లికాడలు - 100 గ్రాములు
వెనిగర్ - 4 స్పూన్స్
అజినమెటో - 2 స్పూన్స్
కార్న్‌‌ఫ్లోర్ పౌడర్ - 2 స్పూన్స్
అల్లం వెల్లుల్లి - 100 గ్రాములు
పచ్చిమిర్చి - 10
నూనె - సరిపడా
ఉప్పు - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో మీల్‌మేకర్స్‌ను నీటిలో నానబెట్టి వాటిని 10 నిమిషాల పాటు స్టౌమీద ఉడికించాలి. ఆ తరువాత గిన్నెలోని నీటిని తొలగించి మీల్‌మేకర్స్‌ను దోరగా నూనెలో వేయించుకోవాలి. మరో బాణలిలో నూనెపోసి కాగాక అందులో పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా తరుగుకుని వాటితో పాటు అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను కలుపుకోవాలి.
 
ఆ కలిపిన మిశ్రమాన్ని సన్నని మంటపై ఉంచి బాగా వేగాక రెండు గ్లాసుల నీరు పోసి సోయాసాస్, వెనిగర్, అజినమోటో, ఉప్పు వేసి కలుపుకోవాలి. కాసేపయ్యాక కార్న్‌ఫ్లోర్‌ను నీటితో కలిపి ఆ మిశ్రమంలో వేయాలి. నీరు ఇంకే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. అలా నీరు ఇంకిన తరువాత సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వేసి పొడిగా వేయించి మంచూరియా తయారు చేసుకోవాలి. అంతే మీల్‌మేకర్ మంచూరియా రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?

గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు

తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్

భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీసిన శాడిస్ట్ భర్త అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

తర్వాతి కథనం
Show comments