Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మునగాకును రసాన్ని తీసుకుంటే ఆ జబ్బులన్నీ నయమవుతాయ్...

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహరమే. అయితే మునక్కాయలను వాడినంతంగా మునగాకు మనలో చాలా మంది వాడరు. కాబట్టి మునగాకులో అద్భుతమైన ఆరోగ్యప్రయోజానాలున్నాయని, సుమారు 300 వ్యాధులనుపైగా నయం చేసే శక్తి మునగాకులలో ఉన

Advertiesment
మునగాకును రసాన్ని తీసుకుంటే ఆ జబ్బులన్నీ నయమవుతాయ్...
, గురువారం, 31 మే 2018 (10:52 IST)
మునక్కాయలు నిత్యం మనం తినే ఆహరమే. అయితే మునక్కాయలను వాడినంతంగా మునగాకు మనలో చాలామంది వాడరు. మునగాకులో అద్భుతమైన ఆరోగ్యప్రయోజానాలున్నాయని, సుమారు 300 వ్యాధులనుపైగా నయం చేసే శక్తి మునగాకులలో ఉన్నదని తాజా పరిశోధనల్లో వెల్లడైయ్యింది.
 
మునగాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఫైబర్, పాస్పరస్, ఐరన్, ఖనిజ లవణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. మునగాకును మానవుల పాలిట సంజీవినిగా చెప్పవచ్చును. క్యారెట్‌తో పోలిస్తే మునగాకులో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. కళ్ల వ్యాధులకు సంబంధించిన మందులలో మునగాకును వాడుతారు. మునగాకు క్యాన్సర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. పాలిచ్చే తల్లులకు మునగాకు కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. 
 
మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టిలోపాలు, రేచీకటి వంటి సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి మునగాకు ఒక దివ్యఔషధంగా చెప్పవచ్చు. క్రమం తప్పకుండా మునగాకు రసాన్ని తీసుకోవడం ద్వారా మహిళలలో ఏర్పడే రక్తహీనత సమస్యను దూరం చేసుకోవచ్చును. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానమని చెబుతారు.
 
చర్మరోగాలకు మునగాకును నూరి కట్టుకట్టుకుంటే ఆ వ్యాధులను నివారింపబడతాయి. మునగాకులను నీటిలో వేసి కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి త్రాగితే ఆస్తమా, టి.బి. దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చును. దీని రసాన్ని పాలలో కలిపి పిల్లలకు ఇవ్వడం వలన వారి ఎముకలు బలంగా తయారవుతాయి. 
 
అలాగే మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిపి ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఈ మునగాకును నూరి కీళ్లనొప్పులు బాధించే చోట కట్టుగా కట్టుకుంటే అలాంటి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. దీనిని ఆహారంగా తీసుకోవడం వలన బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్ క్రమబద్దీకరింపబడుతాయి. అలాగే థైరాయిడ్ సమస్యకు నేచురల్ మెడిసిన్ ఈ మునగాకే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనపనార విత్తనాలు తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టేయచ్చు...