గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి..?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (12:43 IST)
సాధారణంగా ఉప్పుని మనం వంటకాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ ఉప్పులో చాలా అద్భుతమైన గుణాలున్నాయని  కొందరికి తెలియదు. వంటల్లో ఉపయోగించే ఉప్పు ఆరోగ్యాన్నే కాదు ఇంటిని కూడా శుభ్రపరుస్తుంది. ఉప్పుని ఉపయోగించడం వలన కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
1. ఉప్పులో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కలిపి రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరిసిపోతాయి.
 
2. ఇంట్లో చీమల బెడద ఉంటే కొద్దిగా ఉప్పు తీసుకుని ఇంట్లోని త‌లుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్ర‌ాంతాల్లో చల్లితే చాలు. 
 
3. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కిచెన్ సింక్‌ను క్లీన్ చేస్తే జిడ్డు తొలగి అందులో ఇరుక్కున్న ప‌దార్థాల‌న్నీ పోతాయి.
 
4. కొద్దిగా ఉప్పు, ల‌వంగ నూనెను తీసుకుని బాగా క‌లిపి శ‌రీరానికి రాయాలి. 10 నిమిషాల తరువాత స్నానం చేస్తే చ‌ర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శ‌రీరం ప్రకాశవంతంగా మారుతుంది.
 
5. గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నోటిని పుక్కిలిస్తే.. దంతాల నొప్పి, నోటి పూత వంటివి సమస్యలు తొలగిపోతాయి.
 
6. బేకింగ్ సోడా, ఉప్పును తీసుకుని దానిలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసి ప‌ళ్లు తోముకుంటే ప‌ళ్లు మిల‌మిలా మెరుస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?

వరుడికి ఎయిడ్స్ వుందని తెలిసి పెళ్లికి నో చెప్పిన యువతి.. కానీ ఇంటికెళ్లి బలవంతంగా ఇంజెక్షన్?

భర్తను స్నేహితుడి సాయంతో చంపేసిన భార్య.. నిద్రలో వుండగానే?

పటాన్‌చెరు గుడిసెలో దంపతుల హత్య.. ఏం జరిగింది?

పాడేరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పలు కార్యక్రమాలకు శ్రీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: కొరియన్ ఫుడ్ తింటూ షూటింగ్ కు సిద్ధమవుతున్న కొరియన్ కనకరాజ్

Vishal: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపిన నటుడు విశాల్

Mehar Ramesh: సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం, దాసరి విగ్రహానికి స్టేజీ ఏర్పాటు:: మెహర్ రమేష్

Sangeeth Shobhan :: ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా.. అంటూ ప్రేమగీతంలో అలరించిన సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌

Trisha: టీవీకే పార్టీలో చేరనున్న నటి త్రిష?

తర్వాతి కథనం
Show comments