Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం మెత్తబడినపుడు.. ఏం చేయాలి..?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:20 IST)
అన్నం మెత్తబడినపుడు క్యారెట్ కోరు వేస్తే పొడిపొడిగా ఉంటుంది. కుర్చీలు, టేబుల్స్, స్టూల్స్ గానీ గచ్చుమీద జరిపేటప్పుడు వాటి కాళ్ళకు పాత సాక్సులు తొడిగితే జరిపేటప్పుడు గీతలు పడవు.
 
పట్టుచీరలు మంచి సువాసన రావాలంటే మొగలిపూవుల రేకులను చీరల మడతల్లో పెట్టండి. పట్టుచీరల బోర్డడ్ స్టిఫ్‌గా ఉండాలంటే ఆ ప్రదేశాన్ని తడిపే ముందు ఆ బోర్డర్‌ను తాడుతో నీళ్ళలో తడపాలి. ఇలా చేయడం వలన బోర్డర్ కలర్ చీరకు అంటుకోదు.
 
మిరియాల పొడి నిమ్మరసం కలిపి రాత్రిపూట తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేస్తే చుండ్రుపోతుంది. పకోడీలు మరీ మెత్తగా వస్తుంటే.. సెనగపిండిలో చెంచా వేడి నూనె, చిటికెడు వంటసోడా కలిపితే చాలు. చిన్న ఇంగువ ముక్కను శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి సగ్గుబియ్యం వడియాలు నిల్వ ఉంచిన డబ్బాలో ఉంచితే వేయించేటప్పుడు మంచి వాసన వస్తాయి. 
 
వేయించడానికి ముందు బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్లలో అరగంటపాటు నానబెట్టితే ముక్కలు రుచిగా ఉంటాయి. గసగసాలను వేడినీళ్ళలో నానబెట్టి రుబ్బితే మిశ్రమం మెత్తగా అవుతుంది. పాస్తాను ఉడికించే నీళ్లలో స్పూన్ ఆలివ్ నూనె కొద్దిగా ఉప్పు వేస్తే ఒకదానిఒకటి అతుక్కోదు. వంటింటి గట్టుపై వలికిన నూనె శుభ్రం చేయడానికి కొద్దిగా గోధుమపిండిని చల్లాలి. అది నూనెను పీల్చుకున్న తరువాత పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments