మనం వాడే వంటనూనెతోనే గుండె జబ్బులు ఆధారపడి ఉంటాయి. నూనెలోని కొవ్వు పదార్థాలు గుండె వ్యాధులను పెంచుతాయనడంలో సందేహం లేదు. కాబట్టి మనం వాడే నూనెలో కొవ్వు శాతం తక్కువగా ఉందా లేదా అనే విషయాన్ని చూసుకోవాలంటున్నారు వైద్యులు.
మార్కెట్లో రకరకాల వంట నూనెలు లభ్యమవుతుంటాయి. రకరకాల వంటనూనెలు వేడి చేసినప్పుడు వాటి ఉష్ణోగ్రత కూడా మారుతుంటుంది. ఏ నూనెలైతే ఎక్కువగా వేడిచేసిన తర్వాత పొగలు వస్తాయో అవి తాళింపుకు బాగా ఉపయోగపడుతాయి. వేరుశెనగలు, సోయాబీన్, సన్‌ఫ్లవర్ గింజలను ఇలాంటి నూనెల్లో వేపుడుకు ఉపయోగించవచ్చు.
వంటనూనెను ఎక్కువసేపు వేడిచేస్తే అందులోనున్న విటమిన్ ఈ నష్టపోతామని పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. బాణలిలో ఉన్న నూనెను నాలుగుసార్లకన్నా ఎక్కువగా వాడకూడదంటున్నారు వైద్యులు. ఒకసారి వాడిన నూనెను మరోమారు వాడే ముందు పాత్రలోని అడుగుభాగాన్ని వడగట్టండి.
సన్‌ఫ్లవర్ నూనె లేదా నువ్వులనూనె వాడండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. వంటనూనెపై సూర్యరశ్మి పడకుండా జాగ్రత్త వహించండి. వంటకు వాడే నూనెలో 8 నుండి 10 శాతం సాచురేటేడ్ కొవ్వు ఉండేలా చూసుకోండి. అంతకన్నా ఎక్కువగా ఉంటే ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఇది రక్తంలో కొవ్వుశాతాన్ని పెంచుతుంది.