Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్డు పెంకుని మెత్తగా పొడిచేసి...?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (14:48 IST)
ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఎంత తాపత్రయముంటుందో.. అదే విధంగా వంటకాలు తయారుచేయాలని ఉంటుంది. మనం చేసే వంట శుభ్రం, రుచిగా ఉంటేనే అవి మంచి ఫలితాలు కల్పిస్తాయి. లేదంటే.. మనం చెప్పలేం. కనుక, ఈ చిన్న పాటి చిట్కాలు పాటించి.. శుభ్రమైన ఆహారాన్ని తయారుచేసుకోవచ్చును. మరి అవేంటో ఓసారి...
 
1. ఆమ్లేట్ వేసేముందు పెనం మీదు కొద్దిగా ఉప్పు చల్లుకుంటే.. అంటుకోకుండా ఉంటుంది. ఆమ్లేట్ వేసేటప్పుడు కొద్దిగా శెనగపిండి, కొబ్బరికోరు, మసాలా పొడి వేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది.
 
2. అన్నం వార్చినపుడు వచ్చిన గంజిలో చాలా విటమిన్స్ ఉంటాయి. చలికాలం అయితే అందులో కాస్త తేనె, నారింజ రసం కలుపుకుని తీసుకుంటే మంచిది. 
 
3. బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది. పులిహోర వంటివి పొడిపొడిగా ఉండాలంటే.. వండేటప్పుడు స్పూన్ వెన్న చేర్చి చూడండి.
 
4. పూరీలు మెత్తగా అవకుండా బాగా పొంగి ఉండాలంటే.. గోధుమపిండిలో గుప్పెడు బొంబాయి రవ్వ లేదా బియ్యం పిండి కలుపుకుంటే చాలు.
 
5. కోడిగుడ్డు పెంకుని మెత్తగా పొడిచేసి, ప్లాస్కులో వేసి, ఓ గ్లాస్ నీళ్ళుపోసి, బాగా కదపండి. ప్లాస్కు కొత్తదానిలా మెరిసిపోతుంది. టమోటాకూర ఉడికేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే కూర కమ్మని వాసన వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments