చైనాలో షియోమీ సంస్థ ''రెడ్ మీ నోట్ 7''ను విడుదల చేసింది. ఈ ఫోన్ 48/5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో పాటు.. ఇందులో భారీ 4000 ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కలిగివుంటుంది. 3జీబీ.. 4జీబీ ర్యామ్‌తో పాటు 6జీబీ వేరియంట్ కూడా మార్కెట్లో లభించనుంది.
ట్విలైట్ గోల్డ్, ఫాంటాసి బ్లూ, బ్రైట్ బ్లాక్ రంగుల్లో ఈ మార్కెట్లో లభ్యమవుతుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర సుమారు రూ.10,300, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర సుమారు రూ.12,400గా ఉంది.
ఇందులోని ఫీచర్స్ సంగతికి వస్తే..
ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్,
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
టైప్-సి యూఎస్‌బీ పోర్ట్ బాటమ్