Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొటాటో, చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం..? (వీడియో)

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (12:06 IST)
బంగాళా దుంపల్లో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి పిల్లల్లో ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. ఇంకా విటమిన్ బి పిల్లల్లో ఎనర్జీని ఇస్తాయి. విటమిన్ సి పిల్లల చర్మ ఆరోగ్యానికి, ఎముకలకు, కేశాలకు మేలు చేస్తుంది. ఇక చీజ్ విషయానికి వస్తే.. ఇది డైరీ ఫుడ్ కావడంతో క్యాల్షియంను అందజేస్తుంది. అలాంటి పొటాటో, చీజ్ కాంబోలో బాల్స్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
ఉడికించిన బంగాళాదుంపలు - అరకేజీ 
ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్ 
కారం - ఒకటిన్నర స్పూన్ 
మిరియాల పొడి - ఒక స్పూన్
కార్న్ చిప్స్ - రెండు కప్పులు 
కార్న్ ఫ్లోర్ - ఒక కప్పు 
చీజ్ - ఒక కప్పు 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
నూనె, ఉప్పు- తగినంత 
 
తయారీ విధానం.. 
ముందుగా బంగాళాదుంపలను బాగా ఉడికించాలి. వాటిని ఓ బౌల్‌లోకి తీసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ పొటాటో స్మాష్‌కి ధనియాల పొడి, కారం, మిరియాల పొడి, ఒక కప్పు కార్న్ ఫ్లోర్, కొత్తిమీర తరుగు, ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాల్స్‌లా చేసుకుని.. చీజ్‌ను ఆ బాల్స్‌కు మధ్య వుంచి.. రౌండ్ చేసుకోవాలి. వీటిని ప్లేటులో పక్కన బెట్టుకుని.. ఇంతలో ఓ కప్పులోకి కార్న్ ఫ్లోర్‌ తీసుకుని జారుగా కలుపుకోవాలి.

ఈ కార్న్ ఫ్లోర్‌లో సిద్ధం చేసుకున్న పొటాటో బాల్స్‌ను డిప్ చేసి.. కార్న్ చిప్స్‌లో మళ్లీ డిప్ చేసి పక్కనబెట్టుకోవాలి. వీటిని నూనెలో వేసి బాల్ గోల్డెన్ రంగు వచ్చే వరకు ఉడికించి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయినట్లే. ఈ బాల్స్‌ను కాస్త వేడి తగ్గిన తర్వాత టమోటా సాస్‌తో పిల్లలకు సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అల్లు అర్జున్ ఖాతాలో అడ్వాన్స్ బుకింగ్‌లతో కొత్త రికార్డ్

చిరంజీవి లేటెస్ట్ ఫొటో షూట్ - నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెలతో చిత్రం

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

తర్వాతి కథనం
Show comments