Webdunia - Bharat's app for daily news and videos

Install App

మష్రూమ్, పనీర్‌ ఫ్రైడ్ రైస్‌ను ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 18 మే 2019 (18:17 IST)
మష్రూమ్స్, పనీర్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. ఆ రెండింటితో వెరైటీగా మష్రూమ్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం.. ఈ వంటకాన్ని పిల్లలు ఇష్టపడి తింటారు. అసలే వేసవి సెలవులు కావడంతో పోషకాలతో కూడిన ఈ వంటకానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
పుట్టగొడుగుల తరుగు- రెండు కప్పులు 
ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు - రెండు కప్పులు 
ఉడికించిన అన్నం - మూడు కప్పులు 
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
వెనిగర్ - ఒక స్పూన్, 
బాగా ఫ్రై చేసిన స్ప్రింగ్ ఆనియన్ - ఒకటిన్నర కప్పు 
చిల్లీ సాస్, టమోటా, సోయా సాస్- తలా ఒక్కో స్పూన్ 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
జీలకర్ర - ఒక స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
 
తయారీ విధానం:
ముందు స్టౌ మీద బాణలి పెట్టి.. వేడయ్యాక నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. ఈ మిశ్రమం బాగా వేగాక.. మష్రూమ్, పన్నీర్ ముక్కలను వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆపై చిల్లీ, టమోటా, సోయా సాస్‌లను కలిపాలి. 
 
ఇందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్న వేసి మొత్తం మిశ్రమం కలిసే మిక్స్ చేసుకోవాలి. చివర్లో వెనిగర్ చేర్చి.. రెండు నిమిషాల తర్వాత ఉప్పు చేర్చుకోవాలి. అంతే పోషకాలతో కూడిన మష్రుమ్ పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రైస్‌ను కొత్తిమీర గార్నిష్‌తో గోబీ 65, చికెన్ 65లతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

RPF Constable Carries Child: బిడ్డతో పాటు లాఠీ.. ప్లాట్‌ఫారమ్‌పై గస్తీ చేస్తోన్న మహిళా కానిస్టేబుల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments