తొమ్మిదో తరగతి బాలికతో వ్యభిచారం.. హాస్య నటుడు అరెస్టు

ఠాగూర్
బుధవారం, 8 అక్టోబరు 2025 (09:36 IST)
బాలికతో వ్యభిచారం చేయించిన హాస్య నటుడిని చెన్నై మహా నగర పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై కోయంబేడు వంద అడుగుల రోడ్డులోని ఓ వసతి గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. 
 
దీంతో గత నెల 24వ తేదీన ప్రత్యేక బృందం పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో కేకే నగర్‌కు చెందిన తొమ్మిదో తరగతి చదివే బాలికను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ఏపీకి చెందిన సినీ సహాయనటి నాగలక్ష్మి, అంజలి, కార్తిక్, కుమార్‌ను కోయంబేడు మహిళా పోలీసులు ఇటీవల అరెస్టు చేసి విచారించారు. 
 
బాలిక తండ్రి మృతి చెందడంతో తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దీంతో బాలిక తన తల్లి స్నేహితురాలైన చెన్నై కేకే నగర్‌కు చెందిన క్లబ్ డ్యాన్సర్ పూంగొడి, ఈమె స్నేహితురాలు ఐశ్వర్య వద్దకు చేరింది. వీరిద్దరు హాస్య నటుడు భారతి కన్నన్‌తో కలిసి బాలికతో వ్యభిచారం చేయించి రూ.లక్షల్లో సంపాదించినట్లు తేలింది. పోలీసులు పూంగొడి, ఐశ్వర్యను మంగళవారం అరెస్టు చేశారు. అదేవిధంగా భారతి కన్నన్, అతని స్నేహితులు మహేంద్రన్, రమేష్‌లపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు అరెస్టు చేశారు. బాలికను ప్రభుత్వ సంరక్షణా కేంద్రానికి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments