నల్గొండ జిల్లాలో గత 2023లో జరిగిన ఓ అత్యాచార కేసులో 60 యేళ్ల వృద్ధుడికి 24 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. మంగళవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
జిల్లాలోని నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో గత 2023 మార్చి 28వ తేదీన పదేళ్ల బాలికపై 60 యేళ్ల వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా నిద్రిస్తున్న పదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన చెందిన వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మరుసటి రోజు నల్గొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ దాదాపు రెండేళ్ళపాటు సాగింది. ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు... నిందితుడుకి జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.40 వేల అపరాధం కూడా విధించింది. బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని కూడా కూడా కోర్టు తన తీర్పులో ఆదేశించింది.