Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కేలర్ ద్వారా తన కలల ఉద్యోగాన్ని 170% జీతం పెంపుతో పొందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (23:01 IST)
తెలంగాణకు చెందిన ఒక టెక్ ఆశావహుడు, అవినాష్ అలికట్టా. స్కేలర్ నుండి అప్‌స్కిల్లింగ్ తర్వాత, అద్భుతమైన రీతిలో 170% జీతం పెంపుతో, ఉత్పత్తి ఆధారిత స్టార్టప్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంజనీర్‌గా తన కలల ఉద్యోగాన్ని పొందారు. అతను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ, ఒక చిన్న పట్టణం నుండి గౌరవనీయమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఆయన ప్రయాణం, అతని సంకల్పం మరియు నైపుణ్యం యొక్క శక్తికి స్ఫూర్తిదాయకమైన నిదర్శనం.
 
తెలంగాణలోని మహబూబ్ నగర్ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన అవినాష్ మొదట్లో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో తన విద్యను అభ్యసించాలని ఆకాంక్షించాడు. అతను IIT ప్రవేశ పరీక్షలకు శ్రద్ధగా సిద్ధమవుతున్నప్పుడు IITian కావాలనే అతని కల సాకారానికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. టీచింగ్ మెథడాలజీలతో కనెక్ట్ అవ్వడం మరియు సంక్లిష్టమైన భావనల వెనుక ఉన్న లాజిక్‌ను గ్రహించడం అవినాష్‌కి సవాలుగా అనిపించింది. తత్ఫలితంగా, అతను ఒక ప్రైవేట్ టైర్ 2 సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్స్‌లో తన బి.టెక్‌ను కొనసాగించాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.
 
విద్యాపరంగా భిన్నమైన వాతావరణానికి మారినప్పటికీ, అవినాష్ తన అభ్యాస అనుభవాల పరంగా పరిమితులను ఎదుర్కొన్నాడు, అతను తాను  పొందుతున్న విద్యతో  సంతృప్తి చెందలేదు. అయినప్పటికీ, అతను సంప్రదాయ కళాశాల విద్యను కొనసాగించాలా లేదా విజయానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించాలా అనే సందిగ్ధతను ఎదుర్కొన్నప్పుడు ఒక కీలకమైన మలుపు తీసుకున్నాడు. ఈ కీలక ఘట్టమే అవినాష్‌ని తన కళాశాలను విడిచిపెట్టడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించింది.
 
కళాశాల వదిలిన తర్వాత, అవినాష్ స్నేహితులు అతన్ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యం కలిగిన స్కేలర్ అకాడమీకి పరిచయం చేశారు. తన ఆకాంక్షలను రియాలిటీగా మార్చుకోవాలనే కోరికతో, అవినాష్ ప్రోగ్రామ్‌లో చేరాడు, ఇది కీలక భావనలపై లోతైన అవగాహనను అందించడానికి మరియు వివిధ అత్యాధునిక సాంకేతికతలలో బలమైన పునాదిని ఏర్పాటు చేయడానికి రూపొందించిన మెరుగైన పాఠ్యాంశాలను అందించింది.
 
"నేనుప్పుడూ పెద్ద కలలు కంటూనే ఉంటాను. అందుకే నేను ఇంజనీర్‌ని కావాలనుకున్నాను, అదీ ఐఐటియన్‌ని. నేను 7వ తరగతి నుండి దాని కోసం ప్రిపేర్ అయ్యాను. కానీ , వారు అవలంబిస్తున్న పద్దతితో నేను ఇమడ లేక పోయాను. అది నాకు పని చేయదనిపించింది. అప్పుడే  నేను ఒక సాధారణ ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను, అప్పుడు కూడా నాకు అది వర్కవుట్ కావటం లేదనే భావన కలగడంతో, నేను కళాశాల నుండి తప్పుకున్నాను. మా స్నేహితులలో ఒకరు నన్ను స్కేలర్‌కి పరిచయం చేసినప్పుడు, నేను ఒక కోర్సు తీసుకున్నాను అక్కడ నుండి  వెనుదిరిగి చూడలేదు. మొదటి నుండి ప్రారంభించిన నాలాంటి వ్యక్తి, స్కేలర్, నిజానికి, నా కెరీర్‌లో మార్గదర్శక దేవదూత అనే చెప్పాలి.  నేను అభిమన్యు, అన్షుమాన్ మరియు స్కేలర్‌లోని మొత్తం బృందానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాలాంటి టెక్ నిపుణులు మరియు ఆశావహుల జీవితాలపై ప్రభావం చూపడంలో వారు అద్భుతం చేశారు. ఏమీ తెలియని నేనే చేయగలిగితే, అక్కడ ఉన్న మరే ఇతర ఔత్సాహిక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినా చేయగలడు. కాబట్టి వదులుకోవద్దు`` అని స్కేలర్ పూర్వ విద్యార్థి అవినాష్ అలికట్టా అన్నారు.
 
అవినాష్ విజయం  గురించి  స్కేలర్ మరియు ఇంటర్‌వ్యూబిట్ సహ వ్యవస్థాపకుడు అభిమన్యు సక్సేనా మాట్లాడుతూ : " స్కేలర్‌ వద్ద మేము ఎల్లప్పుడూ మా అభ్యాసకుల విజయానికి తోడ్పడటానికి ప్రయత్నిస్తాము. అవినాష్ కథ మాకు స్ఫూర్తిదాయకం కావడానికి తక్కువ కాదు, మరియు ఇది ఖచ్చితంగా మా అభ్యాసకులకు కూడా స్ఫూర్తి దాయకంగా ఉంటుంది, అతని ప్రయాణం మీకు మీ వైఫల్యాలు ఉన్నప్పటికీ, మీరు వాటిని చిత్తశుద్ధితో మరియు దృఢసంకల్పంతో అధిగమించగలరని రుజువు చేస్తుంది. అవినాష్ లాంటి ఆశావహులు ఇంకా చాలా మంది ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు నేను వారికి  నైపుణ్యాన్ని పెంచుకోవాలని మాత్రమే వారికి చెప్పగలను. పరిశ్రమ సంబంధితంగా  ఉండమని కోరతాను . మరింత నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరాలను తీర్చాలని స్కేలర్ కలలు కంటుంది మరియు అవినాష్ వంటి మరింత మంది అభ్యాసకులు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులతో సంబంధం లేకుండా, వారి కలలను కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము..." అని అన్నారు. 
 
స్కేలర్ కొత్త-యుగం సాంకేతికతలపై తన కోర్సు ఆఫర్‌ల ద్వారా కెరీర్‌లను మారుస్తోంది మరియు నిపుణుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. స్కేలర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి డిజిటల్ టెక్నాలజీలపై కోర్సులను నాలుగు సంవత్సరాల రెసిడెన్షియల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మరియు మాస్టర్స్ ప్రోగ్రామ్ గా అందిస్తుంది. నిర్మాణాత్మక పాఠ్యప్రణాళిక మరియు వన్-ఆన్-వన్ మెంటర్‌షిప్‌తో, స్కేలర్ అవసరమైన నైపుణ్యం  అంశాలతో అభ్యాసకులను సన్నద్ధం చేస్తుంది మరియు వారిని నైపుణ్యం కలిగిస్తుంది. తమ ఆఫరింగ్ ద్వారా, ఔత్సాహిక సాంకేతిక నిపుణులు పూర్తి స్టాక్ డెవలపర్‌లు, బ్యాకెండ్ డెవలపర్‌లు, డేటా సైంటిస్ట్‌లు, డేటా అనలిస్ట్‌లు మరియు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు కావడానికి తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకునే అవకాశం అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments